ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడికి.. ధోని స్పెషల్ గిఫ్ట్?
అయితే ధోని లాంటి గొప్ప క్రికెటర్ సమక్షంలో ఆడాలని ప్రతి ఒక్క యంగ్ క్రికెటర్ భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోని కెప్టెన్సీ లో చెన్నై జట్టులో ఆడితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు చాలామంది. అయితే చెన్నై జట్టులో ఆడే ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు ఒక్కసారి ధోనితో కలిసి మైదానంలో క్రికెట్ ఆడితే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకున్న వారిలో ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రహమనుల్లా గుర్బాజ్ కూడా ఒకరు అని చెప్పాలి.
ధోనితో కలిసి కలిసి ఒక మ్యాచ్ ఆడిన చాలు అనుకున్నాడు. ఈ క్రమంలోనే కోల్కతా నైట్రేటర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అతని కల నిజమైంది అని చెప్పాలి. అయితే ధోని తనను అభిమానించే వారికి ఇక తన జెర్సీలపై సంతకాలు చేసి బహుమతులుగా పంపించడం అలవాటు అన్న విషయం తెలిసిందే. గతంలో పాకిస్తాన్ బౌలర్ హరీష్ రావుఫ్ కి సైతం ఇలా ధోని తన జెర్సీ పై సంతకం చేసి బహుమతి ఇచ్చాడు. ఇక ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహమనుల్లా గుర్భాజ్ కి కూడా ఒక బహుమతి పంపాడు మహేంద్ర సింగ్ ధోని. తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీ గిఫ్ట్ గా పంపాడు. ఈ విషయాన్ని గుర్బాజ్ ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు. ప్రియమైన బహుమతి పంపినందుకు ధోనీకి కృతజ్ఞతలు తెలిపారు.