సెల్ఫీ పిచ్చి.. చివరికీ ప్రాణం తీసింది?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. అయితే టెక్నాలజీకి అనుగుణంగానే అటు మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే. టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి అటు ఒకప్పటిలాగా మూఢనమ్మకాలను అస్సలు నమ్మడం లేదు. ఈ క్రమంలోనే నాగరిక సమాజంలో దూసుకుపోతున్నాడు మనిషి. ఉరుకుల పరుగుల జీవితంలో బ్రతికేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.. అయితే ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ వల్ల కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.



 ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ప్రస్తుతం తక్కువ ధరకే ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయ్. ఈ స్మార్ట్ ఫోన్స్ కారణంగా ఎంతో మంది సెల్ఫీలకు అలవాటు పడిపోతున్నారు.. అలవాటు పడటం కాదు ఏకంగా బానిసలుగా మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఇక ఆ సంఘటనను సెల్ఫీలో బంధించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చినఘటన ఇలాంటి పోవలోకి చెందినదే.


 ఏకంగా సెల్ఫీ పిచ్చి బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాదకర ఘటన హన్మకొండ జిల్లా నడి గూడా మండలం కంటాత్మకూరులో వెలుగులోకి వచ్చింది. వాగు వద్ద ముగ్గురు విద్యార్థులు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా దురదృష్టవశాత్తు వాగులో పడిపోయారు. అయితే ఇద్దరు క్షేమంగా బయటకు రాగా మహమ్మద్ ఇస్మాయిల్ అనే విద్యార్థి చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు విద్యార్థులు కూడా వరంగల్ కిట్స్ కాలేజీలో  బీటెక్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: