సునీల్ ఛేత్రి అరుదైన రికార్డు.. అదే విదేశాల్లో ఉండుంటేనా?

praveen
భారత్లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు కొంతమంది అయితే.. స్టేడియం కు తరలి వెళ్ళి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు ఇంకొంతమంది. అయితే క్రికెట్కు ఉన్న విపరీతమైన పాపులారిటీనే ఇక బీసీసీఐకి వేలకోట్ల ఆదాయం తీసుకువస్తుంది అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ ఇండియాలో క్రికెట్ మాయలో పడిపోతున్న ఎంతోమంది క్రీడాభిమానులు మిగతా క్రీడలను మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో ఇక మిగతా క్రీడల్లో ఎంత అద్భుతంగా రాణించినా కూడా వారికి సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు.



 ఇలా అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అద్భుత రికార్డులు సృష్టిస్తున్న ఇంకా భారత్లో సరైన గుర్తింపును నోచుకోలేకపోతున్నా వారిలో భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి కూడా ఒకరు అని చెప్పాలి.. ఇండియాలో క్రికెట్కు ఎలా క్రేజీ ఉంటుందో విదేశాల్లో ఫుట్బాల్ కి అదే రీతిలో క్రేజీ ఉంటుంది. ఒక ఆటగాడు బాగా రాణించాడు అంటే అతన్ని దేవుడిలాగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇక ఫుట్బాల్లో ఉన్న దిగ్గజ ఆటగాళ్లతో సమానంగా రాణిస్తున్న భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికీ మాత్రం తగిన గుర్తింపు రావట్లేదు. అయితే ఇటీవల పాకిస్తాన్ పై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడుగా నిలిచాడు. రోనాల్డో 123 గోల్స్ రిటైర్డ్ ప్లేయర్ అలీ 109 గోల్స్, మెస్సి 103 గోల్స్ తర్వాత ఇక సునీల్ చెత్రి 90 గోల్స్ తో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు.


 అంతేకాదు అత్యధిక గోల్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్స్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు సునీల్ చేత్రి. అయితే ఇదే రీతిలో విదేశాల్లో ఫుట్బాల్ టీంలో ఉండి ప్రదర్శన చేసి ఉంటే మాత్రం సునీల్ చెత్రి ఎంతగానో ఆరాధించేవారు. అతని రేంజ్ వేరేలా ఉండేది. కానీ భారత్లో క్రికెట్ కీ ఉన్న పాపులారిటీ దృశ్య ఫుట్బాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినప్పటికీ సునీల్ చేత్రికి మాత్రం రావాల్సిన గుర్తింపు రావడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: