యాషెష్ సిరీస్.. ఆస్ట్రేలియా ప్లేయర్ అరుదైన రికార్డ్?
నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి శుభారంభం చేసింది అని చెప్పాలి. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇంగ్లాండ్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ చివరికి ఫలితం వారికి అనుకూలంగా రాలేదు. కానీ తర్వాత మ్యాచ్ లలో మాత్రం విజయం సాధించి ఇక ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక టెస్ట్ మ్యాచ్ లో ఐదు రోజుల్లోనూ బ్యాటింగ్ చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ గా ఉస్మాన్ ఖవాజా రికార్డ్ సృష్టించాడు. ఓవరాల్ గా 13వ ఆటగాడిగా నిలిచాడు. తొలి టెస్ట్ ను 393/8వ ఇంగ్లాండ్లో డిక్లేర్ చేయగా.. మొదటి రోజు బ్యాటింగ్ చేశాడు ఉస్మాన్ ఖవాజా. తర్వాత రెండో రోజు 126 పరుగులు, మూడో రోజు 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నాలుగో రోజు ఇంగ్లాండ్ ఆలౌట్ అయిన తర్వాత మరోసారి బ్యాటింగ్ చేసిన ఖవాజా ఇక ఐదో రోజు కూడా బ్యాటింగ్ చూసా అవకాశాన్ని దక్కించుకున్నాడు.