ఇంత చిన్న కారణానికి.. ఆత్మహత్య చేసుకుంటారా?

praveen
ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉన్నట్లుగానే .. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా అందరి ఆలోచన తీరు మారిపోయిందా అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అవును అనే సమాధానమే ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది.


 ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. వెనుక ముందు ఆలోచించకుండా క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో అయితే ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా తెరమీదకి వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం కామన్. అయితే చిన్నపాటి గొడవలకే మనస్థాపం చెందుతూ చివరికి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


 ఇక ఇక్కడ వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని హైదర్గూడాకు చెందిన శంకర్ అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్థాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ కు మాచిన్పల్లికి చెందిన చంద్రకళతో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మద్యానికి బానిసైన శంకర్ తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో భర్త తీరుతో విసిగిపోయిన భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురైన శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ మరణించాడు శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: