వెస్టిండీస్ టూర్ కి.. పూజారాను అందుకే తీసుకోలేదట?

praveen
ప్రస్తుతం టీమిండియా వరుస షెడ్యూల్ తో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది టీం ఇండియా. అక్కడ మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూడు ఫార్మాట్లకు టీమ్ ఇండియా జట్టు సెలక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపై ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూసారు. ఇక ఇటీవలే ముగిసిన ipl లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో  ఎవరికి భారత జట్టులో ఆడే ఛాన్స్ దక్కుతుంది అన్న విషయం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనపరిచారు.


 ఈ క్రమంలోనే ఇక వెస్టిండీస్ పర్యటనలో ఆడబోయే మూడు సిరీస్ లకు గాను ఐపీఎల్ లో రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు బిసిసిఐ సెలెక్టర్లు పెద్దపీటవేశారు అన్నది  తెలుస్తుంది. ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ అందరిని కూడా సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని యంగ్ ప్లేయర్స్ ఇలా సద్వినియోగం చేసుకోబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ కోసం అటు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న పూజారాని పక్కన పెట్టేసారు సెలెక్టర్లు.


 అయితే ఇంగ్లాండు కౌంటిలలో అదరగొట్టిన పూజారాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఊహించని రీతిలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ఇప్పుడు వెస్టిండీస్ టూర్ కోసం టీమ్ ఇండియాలోకి పూజారను తీసుకోకపోవడంపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూజారాని తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై క్రికెట్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. కోచ్ ద్రవిడ్, సెలెక్టర్లు పూజారకు బదులుగా జైస్వాల్, రుతురాజు వంటి యువ ఆటగల్లను ప్రయత్నించాలని అనుకున్నారు. అందుకే పూజారకు వెస్టిండీస్ టూర్ కు తీసుకోవట్లేదు.. అయితే పూజార నార్త్ జోన్ దిలీప్ ట్రోఫీ ఆడనున్నారు అంటూ క్రికెట్ వర్గాలు  చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: