టి20 క్రికెట్లో ఇదొక తుఫాన్.. కసితీరా బాదారు?

praveen
తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కసారి తుఫాను మొదలయ్యాక పరిస్థితి బీభత్సంగా ఉంటుంది. ఉరుములు  మెరుపులకు ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే టి20 ఫార్మాట్లో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్ల ఇన్నింగ్స్ లు కూడా ఇలాగే తుఫాన్ మాదిరిగా ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో కూడా ఇలాంటి తుఫాన్ నే చూశారు ప్రేక్షకులు. ఏకంగా కొడితే సిక్స్  లేదంటే బౌండరీ అనే విధంగా స్టేడియం మొత్తం పరుగుల జావడిలో తడిసి ముద్దయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్లో ఉన్న సర్రి, మిడిలేసెక్స్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా భారీ స్కోర్ నమోదు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు ఏకంగా 253 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన మిడిలేసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది అంటే ఇక బ్యాటింగ్ లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇరు జట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికీ సిక్సర్లు బౌండరీలతో మాత్రం విరుచుకుపడి వీరవిహారం చేశారు. మ్యాచ్ మొత్తంగా 50 బౌండరీలు 24 సిక్సర్లు నమోదు అయ్యాయి.


 ఈ క్రమంలోనే టి20 లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించిన తొలి జట్టుగా మిడిలేసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఓవరాల్ గా టీ20 హిస్టరీలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేదన  కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సర్రి జట్టు 20 ఓవర్ లో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బలిలోకి దిగిన మిడిలేసెక్స్ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. బ్యాటింగ్ కీ వచ్చిన ప్రతి ఒక్కరు కసితీరా బాదారు. ఆఖరిలో మూడు బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. అలవోకగా పరుగులు చేసి విజయం సాధించింది మిడిలేసెక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: