కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే.. నా అసలైన టార్గెట్?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ స్ఫూర్తితో ఎంతోమంది క్రికెటర్లు అటు తమ కెరియర్ లో రాణించగలుగుతున్నారు. అయితే తమకు స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ తో ఒక్క మ్యాచ్ అయిన ఆడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రత్యర్థిగా కోహ్లీని ఎదుర్కొని ఇక వికెట్ పడగొడితే బాగుంటుంది అని కోరుకుంటే.. ఇంకొంతమంది సహచరుడిగా ఆడి కోహ్లీ ఆటతీరును దగ్గర నుంచి చూడాలని భావిస్తూ ఉంటారు.

 ఇలా విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందిన ప్లేయర్స్ లో పాకిస్తాన్ మాజీ అండర్ 19 బ్యాట్స్మెన్ షాయాన్ జహంగీర్ కూడా ఉన్నాడు. జహంగీర్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు  అని చెప్పాలి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్లో జహంగీర్ అద్భుతంగా రానిస్తున్నాడు. ఇక ఇటీవల తన తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు అని చెప్పాలి. సెంచరీ అనంతరం జహంగీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే నా అంతిమ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు.

 టీమిండియాతో తలపడే అవకాశం కోసం ఎప్పుడూ మెగా టోర్నీల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ జహంగీర్ తెలిపాడు. ఇకపోతే గతంలో జహంగీర్ పాకిస్తాన్ ప్లేయర్లు ఇమామ్ ఉల్ హల్, హుస్సేన్ తలక్ లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్ అండర్ 19 జట్టు లో భాగంగా ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చేశాడు. ఇక అతను అమెరికాకు వెళ్లే ముందు దేశీయ క్రికెట్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తరఫున కూడా కొన్నాళ్లపాటు క్రికెట్ ఆడాడు. ఇక వన్డే కెరియర్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన అతను 33.57 సగటు 257 పరుగులు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: