ఐపీఎల్.. బీసీసీఐని మింగేస్తోంది : ఎమ్మెస్కే ప్రసాద్
ఐపీఎల్ అనేది ఫ్రాంచైజీ క్రికెట్ అని అదొక కమర్షియల్ లీగ్ అని దాని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోయే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించాడు. ఐపీఎల్ కారణంగానే ఐసీసీ టోర్నీలో టీమిండియా విఫలం అవుతుంది అంటూ తెలిపాడు. ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ కారణంగా అటు అంతర్జాతీయ క్రికెట్ కు మనుగడ కు ప్రమాదం ఏర్పడుతుంది. ఫుట్బాల్ లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ నే తీసుకుంటే.. ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడటం కంటే ఆ లీగ్ లకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు.
అందుకే ఏ ఆటగాడు అయినా దేశం కంటే ఫ్రాంచైజీ లీగ్ ఆడేందుకు ఇష్టపడతారు. దీన్ని బీసీసీఐ ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఉండవు. ఫ్రాంచైజీ లీగ్ కు జనాలు అలవాటు పడితే ద్వైపాక్షిక సిరీస్ లను చూసే ప్రేక్షకులు కూడా ఉండరు. అప్పుడు ఆటగాళ్లు రోబోలా కనిపిస్తూ ఉంటారూ. ఇలా తీరికలేని షెడ్యూల్ కారణంగానే డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓటమి పాలు అయ్యారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కి ముందు కొంత సమయం కౌంటిల్ లాంటి మ్యాచ్ ఆడి ఉంటే ఆసిస్ చేతిలో అంత ఘోర పరాజయం ఎదురయ్యేది కాదు అంటూ ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.