అతని విషయంలో తొందరపడకండి.. సెలెక్టర్లకు రవిశాస్త్రి సూచన?
అయితే ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం బుమ్రా సిద్ధం చేయడం కోసం వెస్టిండీస్ సిరీస్ తో పాటు ఐర్లాండ్ సిరీస్ లో కూడా ఆడించాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తుంది అని సమాచారం. ఈ క్రమంలోనే బుమ్రా రాక కోసం అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ. ఇకపోతే ఇదే విషయంపై స్పందించిన మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా లాంటి కీలక ప్లేయర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు అంటూ అభిప్రాయపడ్డాడు.
బుమ్రా విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే టీమ్ ఇండియా ఇక కీలకమైన టోర్నీలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ రవి శాస్త్రి హెచ్చరించాడు. పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది విషయంలో పిసిబి ఇలానే తొందరపడిందని.. దీంతో అతను నాలుగు నెలల పాటు జాతీయ జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది అంటూ రవిశాస్త్రి గుర్తుచేశాడు. ఇక బుమ్రాతో ఎక్కువ మ్యాచ్లో ఆడిస్తే భారత జట్టుకు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్, ఆసియా కప్ లను దృష్టిలో పెట్టుకొని బుమ్రా విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు.