విరాట్ లేకుంటే.. మళ్లీ జట్టులోకి వచ్చేవాడిని కాదు : యువీ

praveen
భారత్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఆల్ రౌండర్ల గురించి మాట్లాడుతుంటే యువరాజ్ సింగ్ పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే 2007, 2011 వరల్డ్ కప్ లు గెలవడంలో అటు యువరాజ్ సింగ్ దే కీలక పాత్ర అని చెప్పాలి. ఈ రెండు వరల్డ్ కప్ లు గెలిచిన సమయంలో యువరాజ్ సింగ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోరు. అయితే అటు భార జట్టులో అతను బెస్ట్ ఆల్ రౌండర్ గా మాత్రమే కాదు సిక్సర్ల వీరుడుగా కూడా కొనసాగుతున్నాడు.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ఒక అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు యువరాజ్ సింగ్.



 2011 వరల్డ్ కప్ ను తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో గెలిపించిన తర్వాత.. యువరాజ్ సింగ్ అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడ్డాడు. తర్వాత కీమో తెరఫీ తీసుకుని కోలుకున్నాడు. కానీ మళ్ళీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ  సెలక్టర్లు అతని విస్మరించారు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడు అంటూ యువరాజ్ సింగ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సపోర్టుతోనే అటు యువరాజ్ సింగ్ మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి..


 ఇదే విషయం గురించి మాట్లాడిన యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2017లో నేను పునరాగమనం  చేసినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడు. అతను సపోర్ట్ చేయకపోయి ఉంటే మాత్రం నేను తిరిగి జట్టులోకి వచ్చేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. 2019 ప్రపంచ కప్ కు సెలక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు. వారు జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదు అనే విషయాన్ని నాకు వివరంగా ధోని చెప్పాడు. 2011 ప్రపంచకప్ వరకు ధోని నాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. నువ్వు నా ప్రధాన ఆటగాడివి అని నాతో చెప్పేవాడు. కానీ క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాక ఆటలో టీమ్లో చాలా మార్పులు జరిగాయ్. కొన్నిసార్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు.  జట్టు మొత్తానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: