జట్టులో నో ఛాన్స్.. సర్ఫరాజ్ ఎమోషనల్?
ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాణించిన కొంతమంది యంగ్ ప్లేయర్లకు అటు వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. అయితే రంజి మ్యాచులలో అదరగొడుతున్న సర్ఫరాజ్ విషయంలో మాత్రం మరోసారి అటు సెలెక్టర్లు మొండి గానే వ్యవహరించారు అని చెప్పాలి. అయితే వెస్టిండీస్ పర్యటన కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్ల విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఎంతోమంది మాజీ ప్లేయర్స్ ఇక్కడ జట్టు ఎంపికను తప్పుపడుతూ ఉండడం గమనార్హం.
అదే సమయంలో ఈ పర్యటన కోసం ఎంపిక కాని ప్లేయర్స్ తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. కాగా వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై ముంబై యువ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ తీవ్ర అసంతృప్తికి గురి అయ్యాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో 2022- 23 రంజీ ట్రోఫీ హైలెట్లను పోస్ట్ చేశాడు. ఇక తొమ్మిది ఇన్నింగ్స్ లలో 92.66 సగటుతో 546 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 53 ఇన్నింగ్స్ లో 3880 పరుగులు చేయగా.. ఇక అత్యధిక స్కోరు 301 కావడం గమనార్హం. అయితే అతన్ని టెస్ట్ జట్టులోకి సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదని మాజీ ప్లేయర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.