1983 వరల్డ్ కప్ లో.. టీమిండియా ప్లేయర్స్ వేతనం ఎంతో తెలుసా?
కానీ భారత్‌లో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన మొదట్లో మాత్రం భారత జట్టు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ క్రికెట్ ఆడుతూ ఉండేది. అంతేకాదు ఇక వరల్డ్ క్రికెట్ లో ఒక పసికూనా టీం గా కొనసాగుతూ ఉండేది భారత జట్టు. ఇలా పసికూనటీం గానే 1983 వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన టీమిండియా.. కపిల్ దేవ్ కెప్టెన్సీ లో ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందని విధంగా మొదటిసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది టీం ఇండియా. అయితే టీమిండియా 1983లో వరల్డ్ కప్ గెలిచి నిన్నటికి 40 ఏళ్ళు పూర్తయ్యాయి.
ఈ క్రమంలోనే ఇక 1983 వరల్డ్ కప్ నాటి జ్ఞాపకాలను ఎంతోమంది మాజీ ప్లేయర్స్ గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ప్లేయర్లకు ఇచ్చిన వేతనం ఎంత అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. 1983లో వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయర్లకు డైలీ అలవెన్స్ కింద రోజుకు 200 రూపాయలు చొప్పున మూడు రోజులకీ కలిపి 600.. ఇక మ్యాచ్ ఫీజు 1500 కలిపి మొత్తంగా 2100 మాత్రమే ఇచ్చేవారట. ఈ విషయం తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారత క్రికెటర్లు ఏకంగా కోట్లలోనే సంపాదిస్తూ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.