ప్రపంచ రికార్డు సృష్టించిన.. శ్రీలంక బౌలర్ హసరంగ?
ఇక ఇలా క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడుతున్న టీమ్స్ లో ఇక వరల్డ్ ఛాంపియన్గా కొనసాగిన శ్రీలంక కూడా ఉండడం గమనార్హం. ఇటీవల కాలంలో శ్రీలంక గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడంతో చివరికి ఇక నేరుగా క్వాలిఫై అవ్వకుండా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక క్వాలిఫైయర్ మ్యాచ్లలో పరవాలేదు అనిపిస్తూ వరుస విజయాలు సాధిస్తుంది శ్రీలంక. ఇకపోతే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అదరగొట్టి ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన శ్రీలంక స్పిన్నర్ హసరంగా చరిత్ర సృష్టించాడు.
ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదు కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయంలో హీరోలు పోషించాడు అని చెప్పాలి. అయితే కేవలం ఐర్లాండ్ మ్యాచ్ తో మాత్రమే కాదు అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఇలాగే ఐదు వికెట్ల హాల్ సాధించాడు హసరంగా. దీంతో వరుసగా మూడు వన్డే మ్యాచ్లలో ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్ గా ప్రపంచ రికార్డును సృష్టించాడు ఈ శ్రీలంక బౌలర్. పాకిస్తాన్ మాజీ బౌలర్ వాకార్ యూనిస్ మాత్రమే ఈ రికార్డు సాధించగా.. ఇక ఇప్పుడు ఈ అరుదైన రికార్డు సాధించిన రెండో బౌలర్గా హాసరంగ నిలిచాడు. యూఏఈ తో మ్యాచ్లో 6, ఒమన్ తో మ్యాచ్ లో 5, ఐర్లాండ్తో మ్యాచ్లో ఐదు వికెట్లు సాధించాడు హసరంగా.