టీమిండియా ఫ్యూచర్ పేసర్లు ఆ ముగ్గురే : ఇషాంత్ శర్మ

praveen
గత కొంతకాలం నుంచి ఎంతోమంది యంగ్ బ్యాట్స్మెన్స్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. భారత జట్టులో తమ స్థానాన్ని సృష్టినం చేసుకుంటున్నారు. అయితే బౌలర్లు మాత్రం ఇలా ఎవరు వచ్చి నిలదొక్కుకోలేకపోతున్నారు అని చెప్పాలి. వచ్చి రెండు మూడు మ్యాచ్లలో మెరుపులు మెర్పించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉన్నారు.

 ఇలా బూమ్రా, సిరాజ్, షమీ లాగా ఇక జట్టులో నిలదొక్కుకొని ఎక్కువ కాలం తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్లేయర్లు కనిపించడం లేదు. ఇక ఇటీవల ఇదే విషయం గురించి టీమ్ ఇండియా వెటరన్ ఫేసర్ ఇషాంత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు జట్టు భవిష్యత్తు స్టార్ ఫేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు ఇషాంత్ శర్మ. ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు ఇక రానున్న రోజుల్లో టీమిండియా టెస్ట్ బౌలర్లుగా  స్థిరపడతారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు  ఈ ముగ్గురిని సాన పెడితే టీమ్ ఇండియా తరఫున ఎన్నో అద్భుతాలు చేయగలరు అంటూ అభిప్రాయపడ్డాడు.

 మరీ ముఖ్యంగా ముఖేష్ కుమార్ పై కాస్త ఎక్కువ ఫోకస్ పెడితే అతను ప్రపంచ క్రికెట్లో మేటి బౌలర్ గా అవతరించడం ఖాయం అంటూ జోష్యం చెప్పాడు ఇశాంత్ శర్మ. ముఖేష్ కుమార్ కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో.. గమనించానని చెప్పిన ఇశాంత్.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సహచర బౌలర్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. ముఖేష్ కుమార్ లాంటి అతి సాధారణ వ్యక్తిని నేను చూడలేదు. అతని పలానా డెలివరీ వేయమని అడిగితే.. కచ్చితంగా అదే వేయగల సమర్థత కలిగి ఉన్నాడు. ఒత్తిడిలో  సైతం అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అలాంటి సమయాల్లో బంతిని తన నియంత్రణలోనే ఉంచుకోగలడు అంటూ ఇశాంత్ ప్రశంసలు కురిపించాడు. ఇక ఉమ్రాన్, అర్షదీప్ లను కొద్దిగా సాన పెడితే టీమిండియా కు చాలా కాలం పాటు సేవలు అందించగలరు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: