వరల్డ్ కప్ సెమీఫైనల్స్.. జరిగేది ఎక్కడో తెలుసా?
కాగా వన్డే వరల్డ్ కప్ కోసం జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే భారత్ లో ఏ ఏ వేదికలలో వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ని డిసైడ్ చేశారు అన్న విషయంపై కూడా ఇప్పటికే క్లారిటీ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సెమి ఫైనల్ ఫైనల్ మ్యాచ్ లు ఎక్కడ నిర్వహిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వన్డే ప్రపంచ కప్ సెమి ఫైనల్స్ కు వాంకాడే, ఈడెన్ గార్డెన్స్ లు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు.
అదే సమయంలో ఇక సెమి ఫైనల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలలో అటు చెన్నై కూడా రేసులో ఉంది అని ఆయన చెప్పుకుచ్చారు. వాతావరణ పరిస్థితుల దృశ్య ఈడెన్ గార్డెన్ కు ఆతిథ్యం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కాగా నేడు వేదికల వివరాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం జింబాబ్వే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లలో అటు ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన జట్లు కూడా ఇక వరల్డ్ కప్ లో అర్హత సాధించేందుకు పోటీపడుతూ ఉండడం గమనార్హం.