వన్డే క్రికెట్ హిస్టరీలో.. జింబాబ్వే అత్యధిక స్కోరు?

praveen
అక్టోబర్, నవంబర్ నెలలో టీమ్ ఇండియా వేదికగా వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా అటు వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాయ్. అయితే వరల్డ్ కప్ లో ఆడటం కోసం కొన్ని జట్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వన్డే వరల్డ్ కప్ లో అధికారక మ్యాచ్ లు ఆడే అవకాశాన్ని దక్కించుకోవడం కోసం ప్రస్తుతం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతున్నాయి కొన్ని టీమ్స్.


 అయితే ఇక ఆయా టీమ్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్లు ఏకంగా వరల్డ్ కప్ మ్యాచ్లను తలపిస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచులలో నువ్వా నేను అన్నట్టుగా సాగుతున్న పోరు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే ఇక జింబాబ్వే వేదికగా ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో  సొంత గడ్డపై జింబాబ్వే జట్టు అదరగొడుతుంది అని చెప్పాలి. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం సాధిస్తూ వరుస విజయాలు సాధిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇక వరల్డ్ కప్ కోసం అర్హత సాధించేలాగే కనిపిస్తుంది జింబాబ్వే.



 మొన్న పటిష్టమైన వెస్టిండీస్ కు షాక్ ఇచ్చిన జింబాబ్వే జట్టు.. ఇటీవల యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్లో అయితే సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి 408/ 6 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక వన్డే ఫార్మాట్లో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోరు. ఆ జట్టు ప్లేయర్ సీన్ విలియమ్సన్ 21 ఫోర్లు, ఐదు సిక్సర్లతో  101 బంతుల్లో 174 పరుగులు చేసే విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత యూఎస్ఏ 104 పరుగులకే చాప చుట్టేసింది. 304 పరుగులు తేడాతో విజయం సాధించింది జింబాబ్వే. కాగా జింబాబ్వే ప్రదర్శన పై ప్రస్తుతం ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: