ఆకాశంలో వన్డే వరల్డ్ కప్.. ఐసీసీ భారీ ప్లాన్?
అంతేకాదు ఇక వరల్డ్ కప్ షెడ్యూల్ కు సంబంధించి అటు ఐసీసీ కూడా ఇప్పటికే ఒక డ్రాప్ట్ ను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఏ టీం ఏ సమయంలో ఎవరిని ఎదుర్కోబోతుంది అన్న విషయంపై ఒక క్లారిటీ ఉంది. ఇక వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇక ప్రతి ఏడాది వరల్డ్ కప్ కి ముందు వినూత్నంగా ప్రమోషన్స్ చేసి వరల్డ్ కప్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇప్పుడు మరోసారి ఇదే రీతిలో ప్రమోషన్స్ చేసి ఇక వరల్డ్ కప్ ను మరింత స్పెషల్ గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది వరల్డ్ కప్ కోసం ప్రమోషన్స్ ను ఐసీసీ భారీగానే ప్లాన్ చేసింది అన్నది తెలుస్తుంది. ఏకంగా వరల్డ్ కప్ ట్రోఫీని బీస్తోక్ స్ప్రోటోస్పియరిక్ బెలూన్ సాయంతో ఏకంగా1,20,000 అడుగుల ఎత్తులో ఆవిష్కరించాలని ఐసీసీ నిర్ణయించిందట. అక్కడి నుంచి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇక వరల్డ్ కప్ టైటిల్ను ల్యాండ్ చేయబోతుందట. రేపటి నుంచి ట్రోఫీతో వరల్డ్ టూర్ చేయనుంది. తొలుత ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో ఇక ఈ ట్రోఫీని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 18 దేశాల్లో ట్రోఫీని ప్రదర్శించి సెప్టెంబర్ 4వ తేదీన మళ్లీ ట్రోఫీని ఇండియాకు తీసుకురానుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.