టీమిండియాలో ఆడటం కాదు.. అదే నా టార్గెట్ : అనుజ్ రావత్
ఇప్పుడే టీం ఇండియాలో చోటు కోసం తాను ఎదురు చూడటం లేదని ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణించడమే తన ధ్యేయం అంటూ ఆర్సిబి యంగ్ బ్యాటర్ అనుజ్ రావత్ చెబుతున్నాడు. దేశవాళీ టోర్నీలలో మెరుగైన ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ఆడేందుకు పూర్తి స్థాయిలో సన్నదమవుతానని చెప్పుకొచ్చాడు. ఉత్తరాఖండ్ కు చెందిన 23 ఏళ్ల అనుజ్ రావత్ దేశవాలి క్రికెట్ లో ఢిల్లీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో 2023 సీజన్లో బెంగుళూరు జట్టు తరఫున ఆడిన ఈ వికెట్ కీపర్ ఏడు ఇన్నింగ్స్ లో కలిపి 91 పరుగులు చేయగలిగాడు.
కాగా ఇటీవల ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న. ఇప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదు. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాలి. ఈ టి 20 టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయటం వల్ల ఐపీఎల్లో మరింత ఉత్తమంగా ఆడేందుకు అవకాశం కూడా ఉంటుంది అంటూ అనుజ్ రావత్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి పరవాలేదు అనిపించిన అనుజ్ రావత్.. వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం ఇక ఎక్కువ అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.