ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ ఫిక్స్.. డేట్స్ ఇవే?

praveen
భారత జట్టు ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా ఆడుతుంది. అయితే ఇక ఈ మెగా టోర్నీలు ప్రారంభానికి ముందే అటు టీమ్ ఇండియా వర్సెస్ సిరీస్ లతో బిజీ షెడ్యూల్లో గడపనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జూలై నెలలో మొదటి వారంలోనే అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతుంది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్  ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఆడబోయే జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది.


 ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. అటు హార్దిక్ పాండ్యా టి20 కెప్టెన్ గా జట్టును ముందుకి నడిపించ బోతున్నాడు.. అయితే ఇక వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే అటు టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో ఐర్లాండ్ పర్యటన ఉండనుంది. అయితే ఐర్లాండ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను కూడా కూడా ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది అని చెప్పాలి. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మూడు టి20 సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే ఆగస్టు 18, 20, 23 తేదీలలో ఇక మూడు టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక అన్ని మ్యాచ్ లు మహిళాడే స్టేడియంలోనే జరగబోతున్నాయట. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి అన్నది తెలుస్తుంది. అయితే భారత జట్టు వరుస షెడ్యూల్ తో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో టి20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లేందుకు సమయం కేటాయించిన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక మరికొన్ని రోజుల్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: