అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే.. ఆ కీలక ప్రకటన?
ఇప్పటికే అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది. అయితే ఆయన సెలెక్ట్ అయ్యాక టీం ఇండియాలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కోహ్లి, రోహిత్ టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత కూడా రానుందని తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
హార్దిక్ కు ఛాన్స్: హార్దిక్ పాండ్యకు t20 కెప్టెన్ గా ఛాన్స్ రానుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2024 కు హార్దిక్ ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి తిరిగి రానున్నారు. టీ20 సిరీస్‌లో జట్టును హార్దిక్ నడిపించనున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.