టెస్టు క్రికెట్ కెప్టెన్ గా మళ్ళీ విరాట్ కోహ్లీ?

praveen
క్రికెట్ లో విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కోహ్లీ కొత్త కొత్త రికార్డులు తన పేరు మీద రాసుకుంటున్నాడు. గత ఏడాది నుంచి కోహ్లీ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను మళ్ళీ టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే రోహిత్ కు 36 ఏళ్ళు వచ్చేసాయి. ఆ తరువాత ఇండియా టెస్టు కెప్టెన్ ఎవ్వరనే ప్రశ్న మొదలయ్యింది. ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్‌ లేదంటే శ్రేయస్‌ అయ్యర్‌ వంటి ఆటగాళ్లకు కెప్టెన్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ లు కూడా వస్తున్నాయంట. అయితే గిల్‌ వంటి ఆటగాళ్లపై భారం మోపే బదులు అనుభవం ఉన్న విరాట్ కోహ్లీని కెప్టెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నే ఇప్పుడు మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ప్రశ్న ఎదురైంది.
దీనికి ఆకాశ్‌ చోప్రా స్పందిస్తూ..అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు. తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్‌ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు అని అన్నాడు.
కోహ్లీ కెప్టెన్ గా వైదొలిగాక రోహిత్ శర్మ జట్టు నాయకుడయ్యాడు. కోహ్లి, రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరినప్పటికీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అయితే ఇప్పడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2023 ప్రపంచకప్ పై ఫోకస్ పెట్టారు. ఈసారి వన్ డే వరల్డ్ కప్ భారత్ లోనే జరగనుంది. ఈసారి ఎలాగైనా గెలిచి మరో ప్రంపంచకప్ ని టీం ఇండియాకి ఇవ్వాలని రోహిత్, కోహ్లీ పట్టుదలతో ఉన్నారు. రోహిత్‌ సేన ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. జూలై 12 నుంచి టీం ఇండియా బిజీ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: