ధావన్ కాదు.. కెప్టెన్గా అతనైతేనే బెటర్ : డీకే

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి  దిగబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా కూడా వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా బీసీసీఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఇక ఈ వన్డే వరల్డ్ కప్ ఉండబోతుంది. అయితే ఇక సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనాలోని హంగు జాయ్ వేదికగా ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది అని చెప్పాలి.

 అయితే ఆసియా క్రీడలకు అటు భారత క్రికెట్ జట్టును పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అంగీకరించింది. దీంతో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా అక్కడికి వెళుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ ఉండడంతో ప్రధాన ఆటగాళ్లు కాకుండా ఇక టీమిండియా బీ టీం ని ఆసియా గేమ్స్ కు పంపుతారని ఎంతో మంది మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉందని.. అతని నాయకత్వంలోని  ఇక టీమిండియాను ఆసియా గేమ్స్ కు పంపబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.

 ఈ క్రమంలోనే టీమిండియా సారధిగా శిఖర్ ధావన్ కంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెటర్ అంటూ సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అశ్విన్ ప్రపంచకప్ ప్రాబబుల్స్ లో లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటు సూచించాడు. కొన్నెళ్ల నుంచి అతడు భారత క్రికెట్లో అందించిన సేవలకు గాను.. ఇక అతను కెప్టెన్సీ చేపట్టేందుకు అర్హత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అతను గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని గణాంకాలు పరిశీలిస్తే ఆ విషయం అర్థమైపోతుంది  అయితే వరల్డ్ కప్ జట్టులో అతను పరిగణలో లేకపోతే ఇక ఆసియా గేమ్స్ కు కెప్టెన్ గా పంపిస్తే బాగుంటుంది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: