చరిత్ర సృష్టించిన శ్రీలంక క్రికెటర్.. మొదటిసారి?
అయితే తాము కేవలం జట్టు గెలుపు కోసం మాత్రమే పోరాడుతున్నాము అని చెప్పినప్పటికి.. ర్యాంకుల కోసం పట్టించుకోము అని చెబుతూనే.. ఇక నెంబర్ వన్ ర్యాంకు వస్తే ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. అయితే నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం అనేది అంత సులభమైన విషయం కాదు. కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే ఈ ఘనత సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ఇలాంటి అరుదైన రికార్డును సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే వరుసగా రెండు సెంచరీలు చేయడం ద్వారా ఇక ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఇలా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేస్తున్న ప్లేయర్ ఎవరో కాదు శ్రీలంక మహిళా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న చామరి ఆటపట్టు ఇటీవలే ఒక అరుదైన రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ పై వరుసగా రెండు సెంచరీలు చేయడంతో తొలిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది టాప్ లో నిలిచిన తొలి శ్రీలంక మహిళా ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించింది. కాగా టీమిండియా ప్లేయర్లు హార్మన్ ప్రీత్ ఆరు, స్మృతి మందాన ఏడో స్థానం బౌలింగ్ విభాగంలో సోఫీ ఎక్లిస్టన్ టాప్ ప్లేస్ లో నిలుస్తుంది.