అఫీషియల్ : బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ గా ఆయనొచ్చేశారు?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి వరల్డ్ క్రికెట్ లో రిచెస్ట్  బోర్డుగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిసిసిఐ ఒకరకంగా వరల్డ్ క్రికెట్ ను శాసిస్తుంది అనడంలోనూ సందేహం లేదు. అందుకే ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి లో ఎలాంటి చిన్న మార్పు జరిగిన కూడా అది వరల్డ్ క్రికెట్లో తెలుగు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇలాంటి ఒక పెద్ద మార్పే బీసీసీఐలో చోటు చేసుకుంది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాకు చీఫ్ సెలెక్టరు పదవి ఖాళీగానే ఉంది.


 అంతకుముందు రెండోసారి భారత జట్టు చీఫ్ సెలెక్టర్లుగా ఎంపికైన చేతన్ శర్మకు అటు బీసీసీఐ తో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇక బీసీసీఐ గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మ చివరికి చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటినుంచి ఇక ఈ పదవి ఖాళీగానే ఉంది. అయితే చీఫ్ సెలెక్టర్ లేకుండానే మిగతా సెలక్షన్ కమిటీ ఇక భారత జట్టున ఎంపిక చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. కాగా మరి కొన్ని రోజుల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఈ సమయంలో ఇక చీఫ్ సెలెక్టర్ పదవిని ఫుల్ ఫిల్ చేయడం బీసీసీఐకి తప్పనిసరిగా మారింది.


 చీఫ్ సెలెక్టర్ పదవి కోసం నియామకమయ్యారంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్ల పేర్లు కూడా తెరమీదికి  వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్ పేరు కూడా వినిపించింది. అయితే ఇది అఫీషియల్ అన్న విషయం ఇటీవల అందరికీ అర్థమైంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగర్కర్ సెలెక్ట్ అయ్యారు. భారత తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు నాలుగు టి20 ఆడిన ఆయన్ను చీఫ్ సెలెక్టర్ గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది  ఈ కమిటీలో ఆధార్కార్ తోపాటు శివ్ సుందర్ దాస్, సుభ్రతో బెనర్జీ,  సలీం అన్కోలా, శ్రీధరన్ శరత్ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: