అతను జట్టులో ఉంటే.. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది : హర్భజన్

praveen
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత అటు విశ్వవిజేతగా నిలవడం అనేది భారత జట్టుకు కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో మాత్రం తప్పక విజయం సాధించాలని పట్టుదలను పెట్టుకుంది. దీనికి కారణం ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్  జరుగుతూ ఉండడమే. అయితే ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ సారథంలో తప్పకుండా స్వదేశంలో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అభిమానులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.


 అయితే అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్ర్ ని నవంబర్ 19వ తేదీన ముగుస్తుంది. ఇక అక్టోబర్ 8న ఆస్ట్రేలియా తో మొదటి మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుంది బీసీసీఐ అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2011 వరల్డ్ కప్ గెలిచిన టీం లో సభ్యుడుగా ఉన్న హర్భజన్  సింగ్ టీమ్ ఇండియా పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ భాగస్వామ్యం  ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటింగ్ భారం ఎక్కువగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పైనే ఆధారపడి ఉంటుంది. తర్వాత విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయ్యర్ లు ఓపెనర్లు బాగా ఆడితే ఎంతో ఈజీగా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.


 ప్రస్తుతం గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇండియాలో అతనికి అద్భుతమైన ట్రాక్ కూడా ఉంది. ఇక అతన్ని సరిగ్గా వాడుకుంటే టీమిండియా కి వరల్డ్ కప్ లో మ్యాచ్ విన్నర్గా నిలుపుతాడు. బౌలింగ్ విషయానికొస్తే రవీంద్ర జడేజా కీ బౌలర్ 2023 ఐపీఎల్ లో అతని బౌలింగ్ చూశాం. అయితే యుజ్వేంద్ర చాహాల్ కూడా జట్టులో ఉంటే బాగుంటుంది అంటూ హర్భజన్  అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇక వరల్డ్ కప్ నేపథ్యంలో ఎవరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు ఇస్తున్న రివ్యూలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: