4 నెలలుగా ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కానీ ర్యాంకింగ్స్ లో నెంబర్.1?

praveen
ప్రస్తుతం క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే టి20 ఫార్మాట్లు అని మరో రెండు ఫార్మాట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే  అయితే క్రికెట్ లో ఎన్ని ఫార్మట్లు ఉన్నప్పటికీ అటు ప్లేయర్స్ మాత్రం ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్ లో రాణించాలి అనే కోరికతో ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టెస్ట్ ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతూ ఉంటారు   అయితే కేవలం రికార్డులు క్రియేట్ చేయడమే కాదు..  ఇక ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు.

 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి వారం ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఒక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించడం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్స్ లో ఇక గత వారం మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్లు నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా నాలుగు నెలల నుంచి టెస్ట్ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్ ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా అవతరించాడు అని చెప్పాలి. అదేంటి ఆడకుండా నెంబర్ వన్ ర్యాంక్ ఎలా వచ్చింది అని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా.


 న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇటీవల ఐసీసీ టెస్ట్ క్రికెట్ కు సంబంధించి ప్రకటించిన ర్యాంకింగ్స్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అయితే కేన్ విలియమ్సన్ అని చివరిసారిగా నాలుగు నెలల క్రితం టెస్టు క్రికెట్ ఆడాడు. కానీ ఇక ఆ తర్వాత క్రికెట్ ఆడిన ఏ ప్లేయర్ కూడా అతని కంటే మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో ఇక నాలుగు నెలల క్రితం టెస్టు ఫార్మాట్ ఆడినప్పటికీ ఇప్పుడు కూడా కెన్ విలియమ్సన్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఖాళీ గాయం కారణంగా సర్జరీ చేయించుకున్న కేన్ విలియమ్సన్  పునరావాస కేంద్రంలో కోలుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: