బ్యాటింగ్ కోచ్ గా మారిన కోహ్లీ.. యంగ్ ప్లేయర్ కి సూచనలు?

praveen
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే ఈ పర్యటనను టెస్ట్ ఫార్మాట్ తో మొదలుపెట్టబోతుంది టీమ్ ఇండియా. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికి విండిస్ గడ్డపై అడుగు పెట్టిన టీమ్ ఇండియా ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది అని చెప్పాలి. అయితే ఇక టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ తో పాటు టి20 సిరీస్ కూడా ఆడబోతుంది టీమ్ ఇండియా. అయితే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు అని చెప్పాలి.


 తన సహచర ఆటగాళ్లతో కలిసి నెట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనాద్గత్ లాంటి అనుభవజ్ఞులైన బౌలర్లు బంతులు వేస్తుంటే.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా విరాట్ కోహ్లీ అటు బౌలింగ్ కోచ్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి. ఏకంగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ కు బౌలింగ్ చేస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.


 ఇలా నెట్ ప్రాక్టీస్ సమయంలో యశస్వి జైష్వాల్ చాలా సమయం పాటు విరాట్ కోహ్లీతో గడిపాడు. అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని అంతా అటు యశస్వి జైస్వాల్ తో పంచుకున్నాడు అని చెప్పాలి. కాగా యశస్వి జైష్వాల్ కి తొలిసారిగా భారత టెస్టు జట్టులో చోటు దక్కింది  దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్  లో అద్భుతంగా రాణించడంతో ఇక సెలక్టర్లు ఈ యువ ఆటగాడికి ఛాన్స్ ఇచ్చారు అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేస్తున్న యశస్వి జైస్వాల్ ఇక ఆ తర్వాత టి20 సిరీస్ ఆడబోయే జట్టులో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: