ఇంగ్లాండ్ బౌలర్ మోయిన్ అలీ.. అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాసీస్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ మధ్య సాధారణ మ్యాచ్ జరిగితేనే ఎంతో ఉత్కంఠ  ఉంటుంది. అలాంటిది ఈ రెండు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ జరుగుతుంది అంటే.. ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తవ్వగా ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది.


 అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ లో స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుంటున్న ఆసిస్ జట్టు.. ఇంగ్లాండును దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో విజయం సాధించే సత్తా చాటిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ లోను అదే జోరు చూపించి విజయడంక మోగించింది. అయితే మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి.. అటు సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావించింది. కానీ ఇక పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఇంగ్లాండ్ టీం మూడో మ్యాచ్ లో పట్టు బిగించి ఆస్ట్రేలియాను ముప్పు తిప్పలు పెడుతుంది.


 ఈ క్రమంలోనే ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఎంతో మంది ప్లేయర్లు మంచి ప్రదర్శన చేసి అరుదైన రికార్డులు కొల్లగొడుతున్నారు. కాగా ఇంగ్లాండు సీనియర్ క్రికెటర్ మోయిన్ అలీ ఇటీవల టెస్టులు 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు ఇంగ్లాండు తరఫున టెస్ట్ ఫార్మాట్ లో 200 వికెట్లు పడగొట్టిన మూడో స్పిన్నర్ గా రికార్డ్స్ సృష్టించాడు. ఈ లిస్టులో మోయిన్ అలీ కంటే ముందు డైరెక్ అండర్ వుడ్ 247, గ్రేమ్ స్వాన్ 255 వికెట్లతో ఉన్నారని చెప్పాలి. అయితే ఇంగ్లాండు పట్టు బిగించినట్లు కనిపించిన ఆస్ట్రేలియా మాత్రం హోరాహోరీగా పోరాడుతుంది. దీంతో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: