అరంగేట్రం మ్యాచ్లో సెంచరీపై.. జైష్వాల్ ఏమన్నాడో తెలుసా?
ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన యశస్వి జైస్వాల్.. తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా సెంచరీలు చేస్తూ జట్టుకు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే అతని బ్యాటింగ్ శైలి భారత సెలక్టర్ల చూపును ఆకర్షించింది. ఇంకేముంది అతనికి భారత జట్టులో ఛాన్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో అతనికి ఛాన్స్ కల్పించారు. కేవలం 15 సభ్యులలో ఒకడిగా ఎంపిక అవ్వడమే కాదు తుది జట్టులో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్.
ఇక వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా సెంచరీ చేశాడు. మొత్తంగా 171 పరుగులు చేశాడు. ఒకానొక దశలో యశస్వి జైష్వాల్ డబుల్ సెంచరీ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ 171 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. అయితే సెంచరీపై జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం గర్వంగా ఉంది. కేవలం ఇది ఆరంభం మాత్రమే. ఆటపై మరింత దృష్టి పెట్టి క్షమించాల్సిన అవసరం ఉంది. టెస్ట్ మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డాను. అందుకు తగిన ఫలితం వచ్చింది. తనకు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు కెప్టెన్ రోహిత్ కు ధన్యవాదాలు.