చాహల్ ఎవరో కూడా నాకు తెలీదు.. ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్?

praveen
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఓవర్ లోనే మ్యాచ్ ని పూర్తిగా మార్చేయగల ప్లేయర్స్ లో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. అద్భుతమైన బౌలింగ్ తో ఎన్నో వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్ళికి సంబందించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యుజ్వేంద్ర చాహల్ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌ కావడంతో చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేవాడు. అప్పుడు చాహల్ కు ధనశ్రీకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. వీరిద్దరూ 2020 డిసెంబరులో వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ధనశ్రీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తనకి చాహల్ పరిచయం అయినప్పుడు చాహల్ ఒక క్రికెటర్ అనేది తనకి తెలీదని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధనశ్రీ మాట్లాడుతూ డ్యాన్స్‌ నేర్చుకునే విషయంలో చాహల్‌ ఎంతో ఉత్సాహం, శ్రద్ధ కనబర్చేవాడు. నాకది నచ్చింది. అనేక విషయాల్లో అతనిలా ఎవరూ ఉండలేరు’ అని పేర్కొంది. జీవిత భాగస్వామి విషయంలో ఆప్షన్లను వెతుక్కోవడం.. ఎంతోమందిని కలవడం వంటివి చేస్తున్న ప్రస్తుత తరంలో.. నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం సానుకూల ముద్ర వేసింది. పెళ్లి విషయంలో నాపై ఎప్పుడూ ఒత్తిడి లేదు. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. అంతా బాగుంది’ అని చెప్పింది. అయితే, చాహల్‌ పరిచయమైనప్పుడు అతను ఎవరనేది తెలియదని.. అతను టీమ్‌ ఇండియా జట్టులో అరంగేట్రం చేసేనాటికి తాను క్రికెట్‌ చూడటం మానేసినట్లు ధనశ్రీ పేర్కొంది. చాహల్ కూడా తన ప్రేమ విషయాల్ని చెప్పేసాడు. ప్రేమ, డేట్ అని కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటానని చాహల్ ప్రపోజ్ చేసాడంట. డ్యాన్స్ క్లాస్ లో పరిచయమైన ఈ ఇద్దరి కథ పెళ్ళికి ఇలా వెళ్ళిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు ధోని-సాక్షిల లవ్ స్టోరీని కూడా అందరు గుర్తుచేసుకుంటున్నారు. ధోని సినిమాలో ధోని, సాక్షి ముందు ఎలా పరిచయమ్మారో చూపించిన విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: