సెహ్వాగ్ కు క్రికెట్ ఆడటమే రాదు.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?
ప్రతి మ్యాచ్ లో కూడా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ పరుగుల వరద పారించేవాడు. అందుకే ఓపెనర్ గా బరిలోకి దిగిన వీరేంద్ర సెహ్వాగ్ కూ బంతులు వేయాలంటేనే ప్రత్యర్ధులు భయపడిపోయేవారు అని చెప్పాలి. ఇక ఇలా అటు టీమిండియా హిస్టరీలో లెజెండరీ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఇప్పటికి కూడా ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ వీరేంద్ర సెహ్వాగ్ స్ఫూర్తితోనే క్రికెట్లోకి అడుగుపెట్టడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే అలాంటి లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కి అసలు క్రికెట్ ఆడటమే రాదు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అంతేకాదు వీరేంద్ర సెహ్వాగ్ ను ఎంతో ఈజీగా ఔట్ చేయొచ్చు అంటూ పాకిస్తాన్ మాజీ ఫేసర్ నవీద్ ఉల్ హసన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఫామ్ లో ఉన్న కూడా సెహ్వాగ్ కూ సరిగా ఆడటమే రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్లో అతను ఉండి ఉంటే కనీసం ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా రాకపోయేది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఓ మ్యాచ్ లో సెహ్వాగ్ నన్ను ఏదో అన్నాడు. ఆ సమయంలో నేను మా కెప్టెన్ దగ్గరికి వెళ్లి సెహ్వాగ్ నెక్స్ట్ బంతికే అవుట్ అవుతాడు అని చెప్పాను. తర్వాత స్లో బౌన్సర్ వేస్తే సెహ్వాగ్ వికెట్ దక్కింది అంటూ 2005 వన్డే సిరీస్ విషయాలను గుర్తు చేసుకున్నాడు నవీద్ ఉల్ హసన్.