లేటు వయసులో మెరుపు ఇన్నింగ్స్.. అదరగొట్టిన సీఎస్కే కోచ్?
ఏకంగా లేటు వయసులో ఘాటు ఇన్నింగ్స్ ఆడి అదరహో అనిపించాడు అని చెప్పాలి. ఇక తన ఇన్నింగ్స్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఏకంగా మేజర్ లీగ్ క్రికెట్ లో అతిపెద్ద సిక్సర్ కొట్టాడు అని చెప్పాలి. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫాస్ట్ బౌలర్ ఎంట్రిక్ నార్కియా బౌలింగ్లో బ్రావో ఈ సిక్సర్ కొట్టాడు. నార్కియా ఈ బంతిని గంటకు 143.3 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. అయితే ఈ బంతిని ఏకంగా 106 మీటర్ల సిక్సర్ గా మలిచాడు బ్రావో. కాగా ఈ సిక్సర్ కు సంబంధించిన ఫోటోని పోస్ట్ చేస్తూ చంద్రుడి వద్దకు బ్రావో.. టోర్నమెంట్ లో అతిపెద్ద సిక్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కాగా కేవలం ఒక్క సిక్సర్ మాత్రమే కాదు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా లక్ష్య చేదనలో బ్రావో 39 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు 6 సిక్సర్లు ఉండటం గమనార్హం. అయితే మొదట నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రావో తర్వాత మాత్రం అదరగొట్టాడు. 18 మందిలో పది పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత సిక్సర్లు ఫోర్ల వర్షం కురిపించాడు అని చెప్పాలి. అయితే అతను ఇంతటి వీరోచితమైన పోరాటం చేసినప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం కరువు అవడంతో చివరికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలు అయింది. కాగా బ్రావో ఐపీఎల్లో చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.