చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ బౌలర్.. అరుదైన రికార్డు?

praveen
వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చిరకాల ప్రత్యర్థులుగా  ఉన్న టీమ్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ ఫిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. కాగా ఈ యాషెష్ సిరీస్ లో విజయాన్ని రెండు టీమ్స్ ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడూ ఈ సిరీస్ జరిగిన కూడా ఉత్కంఠ మరో రేంజ్ లో ఉంటుంది. ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు స్టేడియంకి తరలివచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెష్ సిరీస్ ఎన్నో వరల్డ్ రికార్డులకు వేదికగా కూడా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఆతిథ్య  ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ అటు ఇంగ్లాండ్ మాత్రం మూడో టెస్ట్ మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకుని విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. దీంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది  కాగా ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది.


 ఇదిలా ఉంటే ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్టు బ్రాడ్ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో 600 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి.  సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన ఐదవ బౌలర్గా నిలిచాడు. కాగా ఈ సాంప్రదాయమైన క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ కంటే ముందు మురళీధరన్ 800 వికెట్లు, షేన్ వార్న్ 708, అండర్సన్ 688 అనిల్ కుంబ్లే 619 వికెట్లతో ఉన్నారు. ఇటీవల నాలుగో టెస్టులో భాగంగా హెడ్ ను అవుట్ చేయడం ద్వారా స్టువర్టు బ్రాడ్ రికార్డు సృష్టించాడు. కాగా నాలుగో టెస్టులు ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ గెలుచుకోవాలని చూస్తూ ఉంటే ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: