యువ ఆటగాళ్లని చూసి.. నేను ఎంతో స్ఫూర్తి పొందుతా : ధావన్

praveen
భారత జట్టులో సీనియర్ ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు శిఖర్ ధావన్ ఒకప్పుడు భారత జట్టు ఎలాంటి ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన  కూడా శిఖర్ ధావన్ స్థానం సుస్థిరంగా ఉండేది అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో అతను సీనియర్ ప్లేయర్గా మారిపోవడం.. అదే సమయంలో అటు యువ ఆటగాళ్ల  హవా పెరిగిపోవడంతో.. ఇక శిఖర్ ధావన్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా  వన్డే వరల్డ్ కప్ జరగనుండగా..  వరల్డ్ కప్ లో తప్పకుండా ధావన్ కి చోటు దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో గత కొంతకాలం నుంచి వన్డే ఫార్మాట్లో కూడా అతని సెలెక్ట్ చేయకుండా పక్కన పెడుతున్నారు సెలెక్టర్లు.


 ఆసియా గేమ్స్ కోసం అయినా శిఖర్ ధావన్ ను ఎంపిక చేస్తారు అని అనుకున్నప్పటికీ.. ఇక యంగ్ ప్లేయర్ ఋతురాజు గైక్వాడ్ కి కెప్టెన్సీ అప్పగించిన సెలెక్టర్లు.. ఇక శిఖర్ ధావన్ మరోసారి పక్కన పెట్టేసారు. ఇదిలా ఉంటే అటు ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో మాత్రం తనకు జట్టులో చోటు దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ సీనియర్ ఓపెనర్. ఇకపోతే ఇటీవల ముంబైలో వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన ఫిలిం లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ క్రమంలోనే ఏవెంట్లో పాల్గొన్న భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలీ.


 తాము ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ యంగ్ ప్లేయర్లను చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాము అంటూ  ధావన్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టే యంగ్ ప్లేయర్లు కొత్త వ్యూహాలు, కొత్త ఆలోచనలతో జట్టులోకి అడుగుపెడుతూ ఉంటారు. వారిని చూసి మేము స్పూర్తి పొందుతూ ఉంటాం. కొన్ని షాట్స్ ఎలా ఆడాలో ఇక వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కాలానికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి.. అప్పుడే కెరీర్ సాఫీగా సాగుతుంది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: