ఇది కదా జోక్ అంటే.. షాహిన్ ఆఫ్రిది గొప్ప బ్యాటరట తెలుసా?

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో పాకిస్తాన్ క్రికెటర్ షాహీన్ ఆఫ్రిది  కూడా ఒకడు. తన ఆట తీరుతో.. ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు. ఇక పాకిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ.. జట్టు విజయంలో ఎప్పుడు ముఖ్యపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా వరల్డ్ క్రికెట్లో ఉన్న టాప్ టెన్ బ్యాట్స్ లలో అతను కూడా ఒకడు. ఆగండి ఆగండి.. షాహిన్ ఆఫ్రిది ఏంటి బ్యాట్స్మెన్ ఏంటి. పైన అతని గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగానే ఉంది. అతను అత్యుత్తమ ఆటగాడే. కానీ  బౌలర్ మాత్రమే   అతను బ్యాట్స్మెన్ ఎందుకు అవుతాడు అని అనుకుంటున్నారు కదా.


 మీరు అన్నది నిజమే.. క్రికెట్ పై కనీస అవగాహన ఉన్న ఎవరైనా సరే షాహిన్ ఆఫ్రిది టాప్ బౌలర్ అని చెబుతారు.. ఒకవేళ షాహీన్ ఆఫ్రిది బ్యాట్స్మెన్ అని సంబోధించారు అంటే వారికి క్రికెట్ మీద కాస్తైనా నాలెడ్జ్ లేదు అని అనుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే షాహిన్ ఆఫ్రిధిని బ్యాట్స్మెన్ అని చెప్పాడు. ఇంతకీ ఇలా చెప్పిన వ్యక్తి ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదు ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ జాకా అస్రాఫ్. ఆ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదిని టాప్ టెన్ బాట్స్మన్ గా అభివర్ణిస్తూ  ఇక పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.



 ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో షాహీన్ ఆఫ్రిది తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే రెండు రోజుల కిందట జరిగిన ఆసియా కప్ షెడ్యూల్ ఈవెంట్ సందర్భంగా.. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ అశ్రాఫ్ మాట్లాడాడు. తమ జట్టు గొప్పతనం గురించి చెబుతూ షహీన్  ఆఫ్రిదిని టాప్ 10 బ్యాట్స్మెన్ గా అభివర్ణించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విషయానికొస్తే మా కెప్టెన్ బాబర్ నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాడు. ఇతర బ్యాటర్లు కూడా గొప్ప స్థానాల్లో ఉన్నారు. షాహిన్ ఆఫ్రీది కూడా టాప్ టెన్ బ్యాటర్.ఆసియా కప్, ప్రపంచ కప్ టోర్నీలో పాక్ అద్భుతంగా ఆడనుంది.ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ కే జట్టులో ఉన్న ప్లేయర్లు ఏం ఆడతారో తెలియకపోతే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: