సన్రైజర్స్ హెడ్ కోచ్ గా టీమిండియా లెజెండ్.. ఇక దబిడి దిబిడేనా?
2023 ఐపీఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ మార్కరమ్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ మరోసారి వరుస వైఫల్యాలతో నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కోసం మరోసారి జట్టును ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ బ్రియాన్ లారా పై వేటు వేయబోతున్నట్లు సమాచారం. అతని నేతృత్వంలో సన్రైజర్స్ జట్టు 2023 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది పాయింట్లు పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
అయితే మరోవైపు విండీస్ జట్టును చక్కదిద్దే బాధ్యతలను కూడా లారా తీసుకోవడంతో.. ఇక ఐపీఎల్ వైపు అతను మొగ్గు చూపే అవకాశం తక్కువగానే ఉంది దీంతో హెడ్ కోచ్ గా మరొక నిపుణుడిని తీసుకురావాలని భావిస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో లెజెండ్ గా కొనసాగుతున్న మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఖచ్చితంగా వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ కి కొత్త హెడ్ కోచ్గా తీసుకువచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది ఇప్పటికే దీనికోసం వీరేంద్ర సెహ్వాగ్ ను సంప్రదించారట. ఇక అతడి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారట. గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్ కి మెంటార్ గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. అంతేకాదు ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. దీంతో అతని హెడ్ కోచ్ గా నియమించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తుందట.