విండీస్ విలవిల.. ఇండియన్ బౌలర్లు అరుదైన రికార్డ్.
మరీ ముఖ్యంగా అటు భారత బౌలర్లు అయితే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లతో చెడుగుడు ఆడేశారు. ఏకంగా భారత బౌలర్ల దాటికి పేక మెడల కుప్ప కూలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్ల దెబ్బకి అటు 114 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది వెస్టిండీస్. దీన్ని బట్టి చూస్తే ఇక ఇండియన్ బౌలర్లు ఎంతలా విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో భాగంగా భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజ మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టీమిండియా బౌలర్లు ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించారు.
ఒక వన్డే మ్యాచ్ లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కలిసి 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే ఇక భారత క్రికెట్ లో ఈ అరుదైన రికార్డును కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు సృష్టించారు. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్లో విజయం సాధించిన టీమిండియా అటు వన్ డే సిరీస్ లో కూడా శుభారంభం చేసింది. కాగా రెండో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలి అని భావిస్తుంది టీమిండియా. అదే సమయంలో రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తుంది.