అనుచిత ప్రవర్తన.. హర్మన్ ప్రీత్ ను వివరణ కోరిన బీసీసీఐ బాస్?

praveen
సాదరణంగా క్రికెట్ ని జెంటిల్మెన్ గేమ్ గా పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లు తమ హావభావాలను కంట్రోల్ చేసుకుంటూ ఎంతో కూల్ గా మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అటు ప్లేయర్లు ఇక కోపంతో ఊగిపోవుతూ ప్రత్యర్థులతో గొడవకు దిగడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. అయితే మైదానంలో ఇలా ప్లేయర్లు గొడవలు పడటం విషయంలో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఎవరైనా ప్లేయర్లు ఇలా లిమిట్స్ దాటి ప్రవర్తించారు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉంటుంది. జరిమానాల విధించడమే కాదు ఇక కొన్ని మ్యాచ్ లుకు నిషేధం విధించడానికి కూడా వెనకడుగు వేయదు. అయితే ఇక ఇటీవల ఇలాంటి అనుచిత ప్రవర్తనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది భారత మహిళా జట్టు కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో ఎంపైర్  తనను అవుట్ గా ప్రకటించగానే కోపంతో కంట్రోల్ కోల్పోయింది హర్మన్ ప్రీత్.

 ఈ క్రమంలోనే తన బ్యాడ్ తో వికెట్లను తన్నింది. ఇక ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. హార్మన్ ప్రీత్ ప్రవర్తన పై మాజీ క్రికెటర్లు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పటికే ఐసీసీ ఆమెకు జరిమానా విధించడమే కాదు రెండు మ్యాచ్లు నిషేధం కూడా విధించింది. కాగా ఇక ఇప్పుడు బీసీసీఐ కూడా ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తో పాటు ఎన్సీఏ అధ్యక్షుడు వివిఎస్ లక్ష్మణ్.. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ తో మాట్లాడతారు అంటూ సెక్రటరీ జై షా చెప్పుకొచ్చారు. అయితే ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని అప్పిలు చేసే అవకాశం లేదు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: