వన్డే వరల్డ్ కప్.. టికెట్ విక్రయాలు ఎప్పటినుంచి అంటే?
ఈ క్రమంలోనే ఐసీసీ షెడ్యూల్ నేపథ్యంలో ఇక తమ అభిమాన జట్టు ఆడబోయే మ్యాచ్ నేరుగా స్టేడియంలో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే షెడ్యూల్ నేపథ్యంలో ఇక అటు ఇండియాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే పనిలో బిజీ అయ్యారు అని చెప్పాలి. అదే సమయంలో టికెట్స్ ఎప్పుడు విడుదలవుతాయి అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ మళ్లీ రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
దీంతో టికెట్ విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇదే విషయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి సహ సభ్య దేశాలు చర్చించినట్లు సమాచారం. కాగా టిక్కెట్ల విక్రయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందట. అయితే వరల్డ్ కప్ టికెట్లను ఆన్లైన్లో ఆగస్టు 10వ తేదీ నుంచి ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై త్వరలోనే ఐసిసి అధికారిక ప్రకటన చేయబోతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఎప్పుడెప్పుడు టికెట్లు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఇక టికెట్లు రిలీజ్ అయిన నిమిషాల్లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంది అని చెప్పాలి.