ఆందోళన లేదు.. అతను ఫ్యూచర్ స్టార్ అవుతాడు : ద్రావిడ్

praveen
అండర్ 19 టీ20 ప్రపంచకప్ లో అదిరిపోయే ప్రదర్శన చేయడం ద్వారా భారత సెలెక్టర్ల చూపును ఆకర్షించాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే వెంటనే టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. భారత జట్టులో వచ్చిన అవకాశాన్ని అతను బాగా సద్వినియోగం చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే అతను మూడు ఫార్మాట్ల ప్లేయర్ ను అనే విషయాన్ని తన ఆటతో నిరూపించుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రతి ఫార్మాట్లో కూడా మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసి సూపర్ ఫామ్ ను కొనసాగించాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే టీమిండియాకు ఫ్యూచర్ సూపర్ స్టార్ అతనే అంటూ ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు.


 అయితే ఇలా కొన్నాళ్లపాటు వరుసగా అన్ని ఫార్మాట్లలో మెరుపులు మెరూపించిన శుభమన్ గిల్.. గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన గిల్ ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కూడా గిల్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. మొదట జరిగిన టెస్ట్ సిరీస్ లో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి జట్టుకు భారంగా మారాడు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్లలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.


 దీంతో అతని పక్కన పెట్టి అతని స్థానంలో మరో యంగ్ క్రికెటర్ కు అవకాశం ఇవ్వాలి అంటూ వార్తలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే గిల్ ఫామ్ గురించి మాట్లాడిన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి మద్దతుగా నిలిచాడు. అతని గురించి నేను పెద్దగా ఆందోళన చెందట్లేదు. ఎందుకంటే గిల్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను విమర్శించడం సరికాదు. ఇక రాబోయే రోజుల్లో గిల్ మూడు ఫార్మాట్లలో కూడా కీలక ప్లేయర్గా మారుతాడు అంటూ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: