స్టువర్టు బ్రాడ్ రిటైర్మెంట్ పై.. హర్ష భోగ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కి కూడా ఇలాంటి ఒక ఘనమైన వీడ్కోలు లభించింది అని చెప్పాలి. ఏకంగా సొంత జట్టు ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రత్యర్థి ఆస్ట్రేలియా ప్లేయర్లు సైతం అతనికి ఘనమైన వీడ్కోలు పలికారు. ఇక ఇటీవల సిరీస్ లో భాగంగా స్టువర్టు బ్రాడ్ ఆడిన ఐదవ టెస్ట్ మ్యాచ్ తర్వాత అతను తను అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. స్టువర్టు బ్రాడ్ తన కెరియర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో సృష్టించిన రికార్డులు గురించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.
అయితే ఇక స్టువర్టు బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రాడ్ కోసం కామెంట్రీ కెరియర్ ఎదురుచూస్తుంది అంటూ హర్ష భోగ్లే వ్యాఖ్యానించాడు. సమకాలిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన స్టువర్టు బ్రాడ్ ను అనుకున్నంతగా చూడలేకపోయాం అంటూ వ్యాఖ్యానించాడు హర్ష భోగ్లే. అయితే ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు అందరూ కూడా ఆ తర్వాత కాలంలో వ్యాఖ్యాతలుగా మారుతూ.. తమ గాత్రంతో క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అన్నది తెలుస్తుంది.