సంపదతో అహం పెరిగి.. క్రికెటర్లు అలా చేస్తున్నారు : కపిల్ దేవ్
టీమిండియా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కారణంగానే ఇక రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు అంటూ ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల రెండు వన్డే మ్యాచ్లో ఓటమిపై స్పందించిన కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా ప్రస్తుతం ఉన్న టీమిండియా ప్లేయర్స్ అందరికి కూడా గర్వం అహం పెరిగిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ లెజెండరీ క్రికెటర్. ప్రస్తుతం కపిల్ దేవ్ చేసిన షాకింగ్ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఇప్పటితరం క్రికెటర్లలో పొగరు అహం పెరిగిపోవడంతో సీనియర్ క్రికెటర్ల నుంచి నేర్చుకునేందుకు ఎవరు కూడా ఇష్టపడటం లేదు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. సంపద భారీగా పెరగడం వల్ల పొగరు అహం వచ్చిందని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ తరం ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం గొప్ప విషయమని.. ఇదే సమయంలో తాము ఎవరిని అడగాల్సిన అవసరం లేదని. అంతా మాకు తెలుసు అని భావిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే నేటితరం నాటితరం క్రికెటర్లలో తేడా అంటూ తెలిపాడు కపిల్ దేవ్.