చాహల్ ను చితక్కొట్టిన రోహిత్.. వీపు విమానం మోత మోగింది?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. ఇక వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేసిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్లో అదే జోరును కొనసాగించ లేకపోయింది. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ప్రధాన ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగిన యంగ్ టీమ్ ఇండియా చివరికి వెస్టిండీస్ చేతిలో ఓటమి చవిచూసింది అని చెప్పాలి.


 అయితే ఈ ఓటమి తర్వాత అటు టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా గెలిపించే దిశగా ఆటను కొనసాగించలేకపోయాడు అంటూ మాజీలు తీవ్రస్థాయిలో పెదవి విరిచారు అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో అటు రోహిత్, కోహ్లీతో పాటు చాహల్ కూడా తుది జట్టులో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇక భారత స్పిన్నర్ చాహాల్ ను కెప్టెన్ రోహిత్ శర్మ చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే రోహిత్ చాహల్ ను కొడుతుంటే పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ జయదేవ్  నవ్వుకున్నారు.


 అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ రోహిత్ చాహల్ డగ్ అవుట్ లో కూర్చున్నారు. కోహ్లీతో పాటు జయదేవ్  కూడా ఉన్నాడు. అయితే ఈ సమయంలోనే కోహ్లీ, చాహల్ మధ్య ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ ఏకంగా చాహాల్ ను మొదట తల మీద కొట్టాడు. ఆ తర్వాత వీపు విమానం మోత మోగించాడు. అయితే చాహల్ వద్దు అని చెబుతున్న రోహిత్ వినలేదు. ఆ తర్వాత నొప్పితో చాహల్ విలవిలలాడాడు. అయితే ఇది చూసి కోహ్లీ నవ్వుకోవడం మొదలు పెట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: