చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా.. బాబర్ రికార్డు బద్దలు కొట్టిన గిల్?
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన శుభమన్ గిల్ పరవాలేదు అనిపించాడు అని చెప్పాలి. అయితే ఇక ఇన్నింగ్స్ కారణంగా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం రికార్డుని గిల్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. 26 ఇన్నింగ్స్ లలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు ఈ టీమిండియా యంగ్ క్రికెటర్ బాబర్ అజం 26 ఇన్నింగ్స్ లలో 1322 పరుగులు చేశాడు అని చెప్పాలి అయితే వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో 34 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
కాగా తన వన్డే కెరియర్ లో ఇప్పటివరకు 26 మ్యాచులు ఆడిన గిల్ 61 సగటుతో 1352 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. అంతేకాదు ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది అని చెప్పాలి ఇక వన్డే ఫార్మాట్లో గిల్ అత్యధిక స్కోరు 208 గా ఉంది కాగా గిల్ బాబర్ తర్వాత 1303 పరుగులతో ఇంగ్లాండ్ ప్లేయర్ జోనథన్ మూడో స్థానంలో 1275 పరుగులతో పాకిస్తాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ నాలుగో స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. అయితే గిల్ ఇలాంటి రికార్డు కొట్టాడు కానీ అటు రెండో వన్డే మ్యాచ్‌లో మాత్రం ఇండియా ఘోర ఓటమిపాలు అయింది అని చెప్పాలి కోహ్లీ, రోహిత్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగిన ఇండియా చివరికి చిత్తుగా ఓడిపోయింది.