టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆ ఇద్దరు ఇంకా కోలుకోలేదట?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జట్టులో ప్రధాన ఆటగాళ్లందరూ కూడా గాయం బారిన పడుతూ పూర్తిగా టీమ్ కి దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపద్యంలో కీలక ప్లేయర్లు లేకుండానే మేజర్ టోర్నీలు ఆడుతూ ఉంది టీమిండియా. దీంతో సరైన ప్రదర్శన చేయలేక.. ఇక కీలకమైన టోర్నీలలో విఫలమౌతూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది అని చెప్పాలి.

 ఇలా గాయాల బారిన పడిన వారిలో టీమిండియా ఫేసర్ బుమ్రా కూడా ఉన్నాడు. వెన్ను నొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా సర్జరీ చేయించుకుని ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలకమైన బ్యాట్స్మెన్లు కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే ఆసియా కప్ నాటికి.. ఈ ప్లేయర్లు అందుబాటులోకి వస్తారని.. అటు భారత అభిమానులు భారీగానే నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న అయ్యర్, కేఎల్ రాహుల్  త్వరలో జరగబోయే ఆసియా కప్ కి  కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొద్దిరోజులుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ప్లేయర్లు.. పూర్తి ఫిట్నెస్ సాధించలేదు అన్నది తెలుస్తుంది. ఈ నేపద్యంలో ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇక ఫిట్నెస్ సాధించని కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఫిట్నెస్ సాధించని దృశ్య సెలెక్టర్లు పక్కన పెడతారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు కనీసం వరల్డ్ కప్ నాటికి అయినా ఫిట్నెస్ సాధిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: