తప్పిపోయిన పిల్లి.. తెచ్చిన వారికి ఎంత రివార్డు ప్రకటించారో తెలుసా?

praveen
ప్రస్తుతం పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎవరికి నచ్చిన జంతువును వారు ఇంట్లోకి తెచ్చుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇలా ఏకంగా పెంపుడు జంతువులను ఇంట్లో సభ్యుడి లాగానే చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కువగా సినిమాల్లో చూసేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో  ట్రెండును ఫాలో అవుతున్న జనాలు పెంపుడు జంతువులపై  అమితమైన ప్రేమను పెంచుకుంటూ ఉండటం చూస్తున్నాం. పక్కన ఉన్న మనుషులకైనా అంత విలువ ఇస్తారో లేదో కానీ ఇక పెంపుడు జంతువులకు మాత్రం తెగ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే పని ముగించుకుని ఇంటికి వచ్చాక పిల్లలు ఎదురుపడితే ఎలా అయితే మనసు కుదుట పడుతుందో కొంతమందికి ఇలా ఇంట్లోకి వచ్చిన తర్వాత పెంపుడు జంతువులు ఎదురుపడి ప్రేమగా దగ్గరికి వచ్చాయంటే చాలు ఒత్తిడి పోయి మనసు ఆహ్లాదంగా మారిపోతూ ఉంటుంది. అంతలా పెంపుడు జంతువులకు మనిషి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే చాలామంది పిల్లలు, కుక్కలు అంటూ పెంపుడు జంతువులను తెచ్చుకుని పెంచుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా భారీ ఖర్చు పెట్టి తెచ్చుకుని.. ఇక ఎంతో ప్రేమగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువు ఒక్కసారిగా కనిపించకుండా పోతే.


 వామ్మో అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది అని చెబుతూ ఉంటారు జంతు ప్రేమికులు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి తప్పిపోయింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు కుటుంబ సభ్యులు.. ఇక ఆ పిల్లిని పట్టుకొని తీసుకొచ్చిన వారికి ఏకంగా రివార్డుని ప్రకటించారు. మంచిర్యాల జిల్లా లో పర్వీజ్ కుటుంబ సభ్యులు నాలుగేళ్లకు ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే నాలుగు నెలలుగా అది కనిపించడం లేదు  తమ పిల్లని తీసుకొచ్చిన వారికి 10000 బహుమానం ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్లను వివిధ కూడళ్లలో అతికించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat

సంబంధిత వార్తలు: