చరిత్ర సృష్టించిన బాబర్ అజాం.. అరుదైన రికార్డ్?
ఎందుకంటే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేయర్ ని ఆడటం చూస్తే. ఇలా తన ఆడతీయులతో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన బాబర్ అజాం ఇక ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. టి20 క్రికెట్ చరిత్రలో ఒక కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టి20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు బాబర్ అజాం.
ఇలా ప్రేక్షకులందరికీ ఇష్టమైన పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొలాంబో స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న బాబార్. ఇటీవలే గాలే జట్టుతో జరిగిన మ్యాచ్లో 57 బంతుల్లోనే సెంచరీ చేయగా ఇది చూసి ఫ్యాన్స్ అందరూ కూడా అవాక్కయ్యారు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా రెండవ స్థానానికి చేరుకున్నాడు బాబర్ అజామ్. ఈ లిస్టులో మొదటి స్థానంలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో ఉన్నాడు అని చెప్పాలి.