ధోనిని.. భయ్యా అని పిలవడం చాలా కష్టం : ఉత్కర్ష పవార్
అయితే రుతురాజు భార్య ఉత్కర్ష పవర్ కూడా క్రికెటరే కావడం గమనార్హం. మహారాష్ట్ర తరఫున దేశవాళి క్రికెట్ ఆడింది. రుతురాజ్ మాదిరిగా కేవలం బ్యాటర్ మాత్రమే బౌలింగ్ కూడా చేస్తూ ఉంది అని చెప్పాలి. కానీ గత కొన్ని నెలల నుంచి ఆమె క్రికెట్కు దూరంగా ఉంటున్నారు. పూణేలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రీషియన్ ఫిట్నెస్ సైన్స్ లో చదువుకుంటున్నారు ఆమె. అయితే ఇలా క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేవుడిలా కనిపిస్తూ ఉంటాడు. అతన్ని ఒక్కసారిగా కలిసిన చాలు అని ఎంతో మంది ఆశ పడుతూ ఉంటారు.
ఇకపోతే గతంలో ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనిని కలిసినప్పుడు.. కలిగిన అనుభూతిని ఇటీవలే ఉత్కర్ష పవార్ ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించింది. ధోని ఉన్నచోట ప్రత్యేక వాతావరణము ఉంటుంది. మీరు ఆయనను బయ్యా లేదా మరో విధంగా పిలవలేరు. గౌరవంతో సార్ అనే ఆటోమేటిక్గా పిలిచేస్తారు. కానీ ఆయన మాత్రం సింపుల్ గా వినయంగా ఉంటారు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే ధోని చాలా సరదాగా ఉంటారు. అతని నవ్వు అద్భుతంగా ఉంటుంది. తన చుట్టూ స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా ధోని చూసుకుంటాడు. ధోని ప్రతి ఒక్కరిని సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు. నేను కూడా ధోనిని కుటుంబ సభ్యుడిగానే భావించాను అంటూ ఉత్కర్ష పవార్ తెలిపింది.