మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. ఇప్పుడు కొత్త అవతారం?
ఈ క్రమంలోనే ఇలా కొన్ని ఇంటర్వ్యూలలో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ ను ఊపేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా సిద్ధమైంది. కానీ అంతకుముందే చేతన్ చర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అయితే చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక ఆ పదవి ఎన్నో రోజులపాటు ఖాళీగానే ఉంది. ఇలా గతంలో తన కామెంట్స్ తో సంచలన వివాదానికి తెరలేపిన చేతన్ శర్మ ఇక ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు అనేది తెలుస్తుంది.
మొన్నటి వరకు చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న చేతన్ శర్మ.. ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ వ్యాఖ్యాతగా మారబోతున్నాడు అని తెలుస్తుంది. ఇటీవల ఏకంగా కామెంట్రీ చేస్తున్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు చేతన్ శర్మ. ఇక ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా చేతన్ శర్మ రాజీనామా తర్వాత చీఫ్ సెలెక్టర్ పదవి కొన్నాళ్లపాటు ఖాళీగా ఉండగా.. ఇటీవల భారత మాజీ ఆటగాడు అజిత్ అగర్కర్ కు ఆ పదవి బాధ్యతలు అప్పగిస్తూ బిసిసిఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.